మంత్రాలకు చింతకాయలు రాలతాయా?అని ప్రశ్నించే వారికి సమాధానం పాముల నర్సయ్య జీవితం.ఎందుకంటే దైవత్వం మూర్తీభవించిన పాముల నర్సయ్య నోటి నుంచి వచ్చే మంత్రం విషానికి విరుగుడుగా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దైవానుగ్రహం తో ప్రసాదించబడిన ఆ మంత్రం ఆనాటి కాలంలో పాము కాటుకు గురైన ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించింది . దైవశక్తి గల ఆ మంత్రం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఎలాంటి కాలకూట విషానికైనా విరుగుడు లభించినట్లే. దైవానుగ్రహంతో తన మాటనే మంత్రం గా మలచుకున్న కారణజన్ముడు పాముల నర్సయ్య .
నరసయ్య మంత్ర మహిమ...
పాముల నర్సయ్య విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉందని గ్రహించి ఆయనకు గారుడీ మంత్రాన్ని ఉపదేశించారు. విషాన్ని హరించే మంత్రం అది. నర్సయ్య ఆ మంత్రాన్ని ఎన్నో ఏళ్ల పాటు భక్తిశ్రద్ధలతో జపించి శక్తిని సాధించారు. ఆ మంత్రశక్తితో ఆయన పాముకాటుకు గురైన ఎంతోమందిని కాపాడారు.
నరసయ్య జీవితానికి ఓ మలుపు...
ఓ బ్రిటిష్ అధికారిని కాపాడటం పాముల నర్సయ్య జీవితానికి ఓ మలుపు గా మారిందని చెప్పవచ్చు. అ మలుపే ఎంతో మందికి ప్రాణదానం జరిగేటట్లు చేసింది. ఒక్కసారి ఓ బ్రిటిష్ అధికారి పాముకాటుకు గురి అయ్యాడు.కొంతమంది చెంచులు పసరు మందు వేసినా ఫలితం కనపడలేదు.శరీరమంతటికీ విషం పాకిపోయింది. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడు అనగా అటుగా వెళ్తున్న నరసయ్యకు ఈ విషయం తెలిసి ఆ బ్రిటిష్ అధికారి చెవిలో మంత్రాన్ని చెప్పాడు. కాసేపటికి ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వేలో ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆయన కూర్చున్న చోట ఫోన్ కూడా ఏర్పాటు చేశారు.
ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు .ఇప్పుడు 108 అంబులెన్స్ నెంబర్ ఎలా ఉందో అలా నర్సయ్య గారి ఫోన్ నెంబరు నాటి జనం నోళ్ళలో నానింది. ఆ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి పాము కాటుకు గురయ్యారు అని చెబితే చాలు ,నరసయ్యగారు ఆ పాము మంత్రాన్ని పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో చెప్పి విషాన్ని దించేసేవారు. ఇలా కేవలం ఫోన్ ద్వారానే మంత్రం చెప్పి కొన్ని వేలమందిని బతికించారు .కానీ ఏనాడు ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు .మద్రాసు రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీ చేసినా,అక్కడ కూడా ఇదే విధంగా ఫోను ఏర్పాటు చేయడం జరిగింది.
వైద్యం ఎలా చేసేవారంటే...
మంత్రం పనిచేయాలంటే కొంతమంది స్పర్శ ద్వారా చేస్తారు. మరి కొంతమంది తీర్థం ఇచ్చి మంత్రం పని చేసేలా చేస్తారు. కానీ నర్సయ్య గారు ఫోన్ రిసీవర్ తో నయం చేసేవారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవం వైద్యం ఎలా చేసేవారంటే విజయవాడలోని ఓ వ్యక్తికి పాము కరిచినట్లు ఫోన్ వస్తే ఆ ఫోన్ రిసీవర్ ను పాము కరిచిన వ్యక్తి చెవి దగ్గర పెట్టు అనేవారు. నరసయ్య భుజం మీద ఎప్పుడూ గుడ్డ పీలికలు ఉండేవి .దాంట్లోని ఓ పీలికనకు ముడి వేసి ఆ తర్వాత పాము కాటు వేసిన వ్యక్తికి చెవిలో గారుడీ మంత్రాన్ని చెప్పేవారు. కాసేపు ఆయన కళ్ళు మూసుకొని ఉపాసన చేసేవారు .దిగిపోతుందని చెప్పే వరకు ఆయన పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో ఏదో చెబుతుండే వారు . విషం దిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ గుడ్డ పీలికలలో కొంచెం ఇసుక వేసి దానిని చెట్టుకు కట్టివేసేవారు. దాంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఇలా కొన్ని వేలమందిని ఆయన గారుడీ మంత్రంతో బతికించారు.
చేతులెత్తేసిన పరిశోధకులు...
నరసయ్య మంత్ర మహిమ ను గుర్తించి ఎన్నో దేశాల వారు ఆహ్వానాలు పంపారు .అదే సందర్భంలో ఈయన మంత్రం పై పరిశోధనలు సైతం జరిగాయి .నరసయ్య గారు తన జీవిత కాలంలో 22 సార్లు జర్మనీ వెళ్లారు .అలాగే 12 సార్లు ప్రపంచ పర్యటన చేశారు ఈయన పర్యటించిన దేశాలలో వీరి మంత్రాన్ని ఎన్నో విధాలుగా పరీక్షించారు.
ఓసారి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈయనకే పాము కాటు వేస్తే బ్రతుకుతాడో లేదో పరీక్షించబోయారు, ఇలాంటి పిచ్చి పనులు చేయ వద్దని చెప్పిన వినలేదు. ఈయన నోట్లో నాభి అనే వేరు ఉండేది. దాని రసాన్ని ఎప్పుడూ పిలుస్తూ ఉండేవారు. ఆ మూలిక విషానికి విరుగుడుగా పని చేసేది. నన్ను పాము కాటు వేస్తే ఆ పాము కే ప్రమాదం అని చెప్పారు. కానీ రష్యన్లు ఈయన మాట వినకుండా ,ఎవరితోనో మాట్లాడుతుంటే చాటుగా భయంకరమైన సర్పంతో వేయించారు. సరిగ్గా ఎనిమిది నిమిషాలు అయ్యే సరికి ఆ సర్పం చనిపోయింది . పాము చనిపోయిన విషయం తెలుసుకుని నరసయ్య గారు ఎంతో బాధ పడ్డారు. ఎందుకంటే వీరికి పాములంటే ఎంతో ఇష్టం .ఎవరైనా పాములను చంపితే ఊరుకునేవారు కాదు.
శ్రీ మాత్రే నమహా
ReplyDeleteArunachala Shiva
DeleteJai sree ram.
ReplyDeleteArunachala Shiva
DeleteThank you for showing or telling the greatness of the mystery man to the unknown world( including me..)
ReplyDeleteArunachala Shiva
DeleteIppudu alanti vaaru leru emduku
ReplyDelete🙏🙏🙏🙏 please make videos of soundraya Lahari all slokas in English word to word meaning, please make and some slokas are missing, great job 🙏🙏🙏
ReplyDeleteNamaskar, Request to pls make videos of shlok 8 to 41 of soundarya lahari. Each shlok 108 times.
ReplyDeleteAt present you have made videos till shlok 7.
My compliments to you.
Regards.
Jai Srimannarayana Om Srimathre Namaha 🌹🙏💐Nenu Recent ga me Soundharyalahari Videos chusanu 108 times Parayana chesaru Chala Santosham 30 Shlokam varake Chesaru Migilina vi Poorthi Cheyagalarani Na Manavi... 🌹🙏💐Anyadha Bhavincha vaddhu.. Dhanyawadhamulu 💐🙏🌹
ReplyDeleteplease continue your effort on soundharyalahari slokas. Helping people to chant/learn slokas. Thank you for doing this
ReplyDeletePlease add more sholkas 108 times.
DeleteWe have till shloka7, it is the best way to learn!
Thanks!