మంత్రాలకు చింతకాయలు రాలతాయా?అని ప్రశ్నించే వారికి సమాధానం పాముల నర్సయ్య జీవితం.ఎందుకంటే దైవత్వం మూర్తీభవించిన పాముల నర్సయ్య నోటి నుంచి వచ్చే మంత్రం విషానికి విరుగుడుగా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దైవానుగ్రహం తో ప్రసాదించబడిన ఆ మంత్రం ఆనాటి కాలంలో పాము కాటుకు గురైన ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించింది . దైవశక్తి గల ఆ మంత్రం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఎలాంటి కాలకూట విషానికైనా విరుగుడు లభించినట్లే. దైవానుగ్రహంతో తన మాటనే మంత్రం గా మలచుకున్న కారణజన్ముడు పాముల నర్సయ్య . నరసయ్య మంత్ర మహిమ... పాముల నర్సయ్య విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ...